Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పిల్లల్లో తెలివితేటలు పెరగాలంటే.. తల్లిదండ్రులు ఇలా మాట్లాడాలి!

Children intelligence growth parents communication tips
Advertisement
  • తొలి మూడేళ్లు మెదడు ఎదుగుదలకు కీలకం
  • రోజువారీ సంభాషణలతో పిల్లలకు తెలివితేటలు
  • ఆలోచింపజేసే ప్రశ్నలు అడగాలని నిపుణుల సూచన
  • పిల్లల ఆసక్తిని ప్రోత్సహించాలి
  • వారితోనే కథలు చెప్పించాలి
  • ఖరీదైన గాడ్జెట్ల కంటే తల్లిదండ్రుల మాటలే ముఖ్యం
Advertisement
చిన్న పిల్లలు రోజంతా ప్రశ్నలే అడుగుతుంటారు. ‘అది ఏంటి?’, ‘ఎందుకు?’, ‘ఎక్కడికి వెళుతోంది?’ అంటూ ఆసక్తిగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు వీటిని సాధారణ ప్రశ్నలుగా తీసుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి రోజువారీ సంభాషణలే పిల్లల మెదడు ఎదుగుదల, భాషా నైపుణ్యాలు, ఆలోచనా శక్తిని బలపరుస్తాయి. ముఖ్యంగా తొలి మూడేళ్లలో తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడే విధానం వారి భవిష్యత్‌ అభ్యాసంపై గణనీయ ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

1. రోజువారీ పనులు చేస్తూనే మాట్లాడండి
పిల్లలకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. వంట చేస్తూ, నడుస్తూ, ఇంటి పనులు చేసుకుంటూ ఏం చేస్తున్నారో వారికి చెబుతూ ఉండాలి. నిజ జీవిత అనుభవాలతో పదాలను అనుసంధానం చేస్తే భాష త్వరగా అలవడుతుంది.

2. ఆలోచించేలా ప్రశ్నలు అడగండి
‘ఇది ఏ రంగు?’, ‘ఇది ఏ జంతువు?’ లాంటి ప్రశ్నల కంటే ‘నీకు ఇందులో ఏం కనిపిస్తోంది?’, ‘ఇది ఎక్కడికి వెళుతుందనుకుంటున్నావు?’ వంటి ప్రశ్నలు పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచుతాయి. సమాధానం చెప్పేందుకు వారికి సమయం ఇవ్వడం కూడా ముఖ్యం.

3. పిల్లల ఆసక్తినే అనుసరించండి
వర్షం తర్వాత కప్పను చూసి పిల్లలు ఆసక్తి చూపితే వెంటనే వారిని ఆపేయకుండా, సురక్షిత దూరంలో ఉండేలా చూసుకుంటూ దాని గురించి మాట్లాడాలి. పిల్లల ఆసక్తికి అనుగుణంగా జరిగే సంభాషణలు భాషా వికాసానికి ఎక్కువగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

4. కథ చెప్పే అవకాశం ఇవ్వండి
పార్క్‌కు వెళ్లి వచ్చిన తర్వాత, కథ విన్న తర్వాత జరిగిన విషయాలను పిల్లలే చెప్పేలా ప్రోత్సహించాలి. దీంతో జ్ఞాపకశక్తి, పదసంపద, సంఘటనలను వివరించే నైపుణ్యం మెరుగుపడుతుంది. తప్పులు చేసినా వెంటనే సరిదిద్దకుండా ముందుగా పూర్తిగా చెప్పనివ్వాలి.

5. భావాలకు పేర్లు చెప్పండి
పిల్లలు కోపం, బాధ, భయం, సంతోషం వంటి భావాలను గుర్తించేలా వాటి పేర్లు చెప్పాలి. ఇలా చేస్తే భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, నియంత్రించుకోవడం, సమస్యలను పరిష్కరించడం సులభమవుతుంది.
Advertisement
Advertisement
Children
Parenting Tips
Child Brain Development
Intelligence Growth
Language Skills
Early Childhood Education

More Telugu News